అసెంబ్లీలో అచ్చెన్న గొంతు వినిపించకూడదనే కుట్ర : మీనాక్షి నాయుడు

అసెంబ్లీలో అచ్చెన్న గొంతు వినిపించకూడదనే కుట్ర : మీనాక్షి నాయుడు
X

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గొంతు వినిపించకూడదనే.. ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇంఛార్జ్‌ మీనాక్షినాయుడు. సీబీఐ కూడా అరెస్ట్‌కు ముందు ముందస్తు నోటీస్‌ ఇస్తుందని.. ఇలా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. వేకువజామున వెళ్లి అక్రమ అరెస్ట్‌లు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. అచ్చెన్నాయుడు టీడీపీలో బలమైన నాయకుడని.. వారి కుటుంబం ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తోందని అన్నారు.

Tags

Next Story