ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వాన

ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నల్లమల ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో కుండపోత వాన కురిసింది. దీంతో.. రాచర్ల దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కంభం-సోమిదేవి పల్లి మధ్య రైల్వే స్తంభాలు కూలిపోయాయి. రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల ట్రాక్ పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నల్లమల, గిద్దలూరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సగిలేరు వాగు పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహం భారీగా ఉంది. దీంతో.. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. గిద్దలూరు, కంభం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. రహదారులు కోసుకుపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

