అచ్చెన్నను కక్షపూరితంగా అరెస్ట్ చేయించారు : రామ్మోహన్‌ నాయుడు

అచ్చెన్నను కక్షపూరితంగా అరెస్ట్ చేయించారు : రామ్మోహన్‌ నాయుడు
X

ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున మాట్లాడటమే అచ్చెన్నాయుడు చేసిన తప్పా అని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. అచ్చెన్నాయుడిని కక్ష పూరితంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి అరెస్ట్ చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. తమ కుటుంబానికి అవినీతి మచ్చ లేదని, అక్రమ అరెస్ట్‌లతో బలమైన గొంతుకలను అణచివేయలేరని అన్నారు రామ్మోహన్‌ నాయుడు. సీఎం జగన్ బీసీలకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారని.. బీసీల ఆగ్రహం ఎలావుంటుందో చూపిస్తామని హెచ్చరించారు.

Tags

Next Story