ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
X

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 12.30 గంటల ప్రాంతంలో మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఇంటర్‌ పరీక్షలు పూర్తైనా మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత మూల్యాంకనం నిర్వహించారు. తాజాగా ఈ ప్రక్రియ పూర్తి కావడంతో.. ఇవాళ ఫలితాలు విడదల చేయనున్నారు. పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల తేదీలు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించనున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఎగ్జామ్స్‌ జరిగాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించి తీరుతామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి ఆది మూలపు సురేశ్. జూలై పది నుంచి 15 వ తేదీ వరకు టెన్త్‌ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి.

Tags

Next Story