అచ్చెన్నాయుడును ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు : చంద్రబాబు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.' తెలుగుదేశం శాసనసభ్యులు అచ్చెన్నాయుడుగారు ఏమయ్యారు? నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది? ఆయన్ను 100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారు?' అంటూ ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడును ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు..
ముందస్తు నోటీసు ఇవ్వలేదు..బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుగారిపై జగన్ కక్షగట్టి ఇలా కిడ్నాప్ చేయించడం దారుణం.ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అన్నారు. దీనికి సీయం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలవారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.' అంటు చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

