ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల ప్రాణాలకంటే పదో తరగతి పరీక్షలే ముఖ్యమా? : తులసిరెడ్డి

ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల ప్రాణాలకంటే పదో తరగతి పరీక్షలే ముఖ్యమా? : తులసిరెడ్డి
X

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల ప్రాణాలకంటే 10వ తరగతి పరీక్షలే ముఖ్యమా అని.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయన్నారు తులసిరెడ్డి. రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు.

ఏపీలో 6 లక్షల 39 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందన్నారు తులసిరెడ్డి. ఇప్పటికే 6,7,8,9 తరగతుల పరీక్షలు రద్దు చేసి ఆటోమేటిక్ ప్రమోషన్ ఇచ్చినట్టుగానే.. టెన్త్ క్లాస్ విద్యార్థులను పట్టించుకోవాలన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి.. 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేయాలన్నారు. ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ మార్కులు, హాజరు ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Tags

Next Story