12 Jun 2020 1:51 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / అక్కడ మాస్కుల వాడకం...

అక్కడ మాస్కుల వాడకం ముందు నుంచే..

అక్కడ మాస్కుల వాడకం ముందు నుంచే..
X

కరోనా వచ్చి మనకెన్నో మంచి పాఠాలు నేర్పిందని అనుకుంటున్నాం కానీ జపాన్ వాసులు శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎవరికైనా కొంచెం జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే వెంటనే మాస్క్ ధరిస్తారు. తమ వల్ల పక్క వారికి రాకూడదనే ముందు జాగ్రత్త. కేవలం జలుబు ఒక్కటే కాదు ఏ అనారోగ్యానికి గురైనా మాస్క్ మస్ట్ గా ధరిస్తారు.

జపాన్ వాసులకు అలెర్జీ ఎక్కువ. వాతావరణ శాఖ అధికారులు ఇక్కడ మనకు వర్షాలు ఎప్పుడు పడతాయి గాలిలో తేమ శాతం ఎంత లాంటి విషయాలు చెబితే అక్కడ గాల్లో పుప్పొడి రేణువుల శాతం ఎంత ఉందో ప్రజలకు ప్రకటన రూపంలో విడుదల చేస్తారు. వసంత కాలంలో చెట్టు చిగురించి పూలు పూసినప్పుడు ఆ రేణువులు గాల్లో కలిసి అనేక మంది అలెర్జీకి గురవుతుంటారు. ముందు జాగ్రత్తగా హెచ్చరికలు అందుకుంటే దానికి అనుగుణంగా మాస్కులు పెట్టుకుని బయటకు వెళతారు.

ఇక పెద్ద పెద్ద రెస్టారెంట్లైనా, చిన్న చిన్న హోటల్స్ లో పని చేసే వారైనా సరే వంట చేసేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ రూల్స్ పాస్ చేసింది జపాన్ ప్రభుత్వం. వడ్డించే సర్వర్ సైతం మాస్క్ ధరించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే సమయంలో సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలి.

జపాన్ వాసులు శీతాకాలంలో సర్జికల్ మాస్కులు ధరిస్తారు. అవి వారిని వెచ్చగా ఉంచుతాయి. అమ్మాయిలు అర్జంట్ పని ఉండి మేకప్ వేసుకోకపోయినా, అబ్బాయిలు షేవింగ్ చేసుకోవడానికి టైమ్ లేకపోయినా మాస్క్ ధరించి కవర్ చేసుకుంటారు.

ఒక్కోసారి మూడ్ బాలేకపోతే అది ముఖంలో కనిపించకూడదని మాస్క్ ధరించేస్తారు. ఇక్కడ మనకి డాక్టర్లు సైతం ఆపరేషన్ సమయంలోనే మాస్క్ ధరిస్తారు. కానీ అక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ఎల్లవేళలా మాస్క్ ధరించి రోగులకు చికిత్సనందిస్తారు. మంచి అలవాట్లు మనం పాటిస్తూ ఎదుటి వారికి చెప్పాలని.

Next Story