ఏపీలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు
X

ఏపీలో కరోనా కేసులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 14,477 నమూనాలను పరీక్షించారు. దీంతో మరోసారి 150కి పైగా కేసులొచ్చాయి. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 4588 కు చేరింది.

ఇక కొత్తగా వివిధ ప్రాంతాల్లో 42 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2641కి చేరింది. కొత్తగా మరో ఇద్దరు మృతిచెందడంతో ఇప్పటివరకూ 82 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1865గా ఉంది.

Tags

Next Story