మళ్లీ ఒకసారి లాక్డౌన్ చేస్తే బెటరేమో.. అధికారుల ఆలోచన

మళ్లీ ఒకసారి లాక్డౌన్ చేస్తే బెటరేమో.. అధికారుల ఆలోచన
X

మొదట సారి లాక్డౌన్ విధించి కరోనా కేసులను కట్టడి చేయగలిగింది చైనా. ఆ ఉత్సాహంతోనే కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించాలని ఆరాట పడుతోంది. అంతలోనే ఆశలమీద నీళ్లు చల్లినట్లు కొత్త కేసులు వెలుగు చూడడం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. చైనా ఆరోగ్య శాఖ అందించిన సమాచారం ప్రకారం బీజింగ్ లో శుక్రవారం నాలుగు పాజిటివ్ కేసులు, శనివారం మరో ఏడు పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. పాజటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

కాగా, గడిచిన 55 రోజుల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. ఊహించని విధంగా ఇప్పుడిలా పాజిటివ్ కేసులు బయట పడడం ఆందోళన కలిగించే అంశం. మరో రెండు రోజులు ఇలానే కొనసాగితే మళ్లీ లాక్డౌన్ విధించాలని అనుకుంటోంది ప్రభుత్వం. ఆ దిశగా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మొదటి సారి లాక్డౌన్ కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగింది చైనా ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ కేసులు వస్తే కట్టడి చేయడం కష్టమని భావిస్తోంది.

వైరస్ వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధించాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా, చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,086 కాగా వీరిలో చికిత్స పొంది కోలుకున్న వారు 78,367 మంది. 4634 మంది వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు 85 వరకు ఉన్నాయి. రెండో దశ లాక్డౌన్ వైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు.

Tags

Next Story