తీవ్ర ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయిన బ్రిటన్

బ్రిటన్ ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌లో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికారిక లెక్కల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు ఏప్రిల్ నెలలో -20.4శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్‌స్ వెల్లడించింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చూస్తే ఇది -10.4శాతంగా ఉంది. ఈ స్థాయిలో జీడీపీ పతనం బ్రిటన్ ఎన్నడూ చవిచూడలేదంటున్నారు డిప్యూటీ నేషనల్ స్టాటిస్టియన్ జోనాథన్ ఆథ్వో. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ నాటికి ఆర్థిక వ్యవస్థ 25 శాతం తగ్గిపోయిందని తెలిపారు. . దీంతో దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకొంది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే -2శాతంగా ఉంది. ఆ తర్వాత కొవిడ్ కారణంగా భారీగా పతనం అయింది. ఏప్రిల్-జూన్ లెక్కలు వస్తే దేశం భారీగా ఆర్థిక మాంద్యంలోకి జారుకొందన్న విషయం అధికారికమవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com