మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..
X

ఏపీలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష టీడీపీపై.. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకున్నట్టుంది. నిన్న సీనియర్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, నేడు మాజీ ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని వీరి నివాసంలో ప్రభాకర్ రెడ్డి తోపాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story