కర్ణాటక నుంచి అన్నీ ఏకగ్రీవాలే

కర్నాటకలో రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేడీఎస్ తరుపున మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్, కాంగ్రెస్ తరుపున మల్లికార్జన్ ఖర్గే, బీజేపీ నుంచి అశోక్ గస్తి, ఇరానా కడడి మొత్తం నలుగురు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంఖ్య బలంకు అనుగుణంగానే ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపడంతో ఎన్నిక కావడం సులభమైంది. అయితే వీరితో పాటు ఒక ఇండిపెండెంట్ నామినేషన్ వేసినా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. ఒక రాజ్యసభ సీటును గెలుచుకోవడానికి 45 మంది ఎమ్మెల్యే బలం అవసరం. దీంతో బీజేపీకి 117 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారి సంఖ్య బలానికి తగ్గట్టు ఇద్దరు సభ్యులను బరిలో దింపింది. అటు, కాంగ్రెస్ కు 68 మంది సభ్యులు ఉండగా.. ఆ పార్టీ తరుపున మల్లికార్జన్ ఖర్గే నామినేషన్ వేశారు. జేడీఎస్ తరుపున బరిలో ఉన్న హెచ్‌డీ దేవెగౌడ్ కు.. ఆ పార్టీ 34 మంది ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు పలకడంతో ఆయన ఎన్నిక సుగమమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com