కృష్ణా జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత
X

కృష్ణా జిల్లాలో భారీగా అక్రమ మద్యం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. మైలవరం మండలం కీర్తిరాయుని గూడెంలో నిల్వచేసిన 35 లక్షల విలువైన 8వేల బాటిళ్లను సీజ్‌ చేశారు. మద్యం బాటిళ్లను పంజాబ్‌ రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇటీవల రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేసింది ప్రభుత్వం. దీంతో పంజాబ్‌ నుంచి తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి ఇక్కడ అధిక లాభాలకు అమ్ముతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Tags

Next Story