అచ్చెన్నాయుడిని పరామర్శిచేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరణ.. పరిస్థితి ఉద్రిక్తం

ఈఎస్‌ఐ కేసులో అరెస్టై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్‌కు చేరుకున్నారు. చంద్రబాబుకు అనుమతి విషయంలో ఉదయం నుంచి హైడ్రామా నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అనుమతి నిరాకరించింది. కొవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడంలేదని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. అటు.. చంద్రబాబు మరో వినతిపై స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్.. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోందన్నారు చంద్రబాబు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రస్తుతం జీజీహెచ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com