టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్.. అన్నిటికీ ఒప్పుకుంటేనే అవకాశాలు: తేజస్వీ

టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్.. అన్నిటికీ ఒప్పుకుంటేనే అవకాశాలు: తేజస్వీ

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొత్తేమీ కాదు. అవకాశాలు రావాలంటే వాళ్లు చెప్పినట్లు వినాల్సిందే అంటూ మరోసారి పాత వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది తాజాగా తెలుగుమ్మాయి తేజస్వి. టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని అంటోంది. తాను నటించిన కమిట్ మెంట్ అనే చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్ల్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో కమిట్ మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు వస్తాయని చెప్పింది. తనను ఎంతో మంది అలా వేధించారని తాను ఒప్పుకోకపోవడంతో నటిగా ఎదగలేకపోయానని చెప్పుకొచ్చింది.

90 శాతం ఇండస్ట్రీలో అలాంటి చెత్తే ఉంది. అదంతా దాటుకున్న తరువాతే అసలైన ఇండస్ట్రీ మనుషులుంటారు. నటించాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్లంతా ఇలాంటి వాటికి సిద్ధపడే వస్తున్నారని ఆమె అంటోంది. ఆ క్యాటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. నాకు తెలిసిన చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వాళ్లెవరూ బయటకు చెప్పుకోరు. బాంబే హీరోయిన్స్ అయితే దేనికైనా ఒప్పుకుంటారనే కారణంతో వారికి అవకాశాలు ఇస్తారని తేజస్వి చెప్పింది. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు, తమిళ అమ్మాయిలకు తెలుసునని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story