క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ కన్నుమూత

క్రికెట్ చరిత్రకారుడు వసంత్ రాయ్‌జీ కన్నుమూత

ప్రముఖ మాజీ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు అయిన వసంత్ రాయ్‌జీ కన్నుమూశారు. ఇటీవలే ఆయన 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా మృతి చెందారని అల్లుడు సుదర్శన్ తెలిపారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాయ్‌జీ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మాన్, 1940 లలో తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడి 277 పరుగులు చేశారు.

ఆయన అత్యధిక స్కోరు 68. 1939 లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జట్టు ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తరువాత 1941లో ముంబైలో వెస్ట్రన్ ఇండియా జట్టు తరుపున ఆడారు. జనవరిలో 100 ఏళ్లు పూర్తిచేసుకున్న రాయిజీని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ , ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story