మాస్క్ లేని వారిపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు

మాస్క్ లేని వారిపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు

కరోనా వ్యాప్తి భయపెడుతున్నా కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్క్‌లు లేకుండానే రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే వ్యక్తిగత జాగ్రత్తలపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.. ఇప్పుడు యాక్షన్‌లోకి దిగారు. మాస్క్ లేకుండా బయటకు వస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లోనే గత రెండు వారాల్లో 272 మందిపై కేసులు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ 51-D ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టినట్టు CI బాలరాజు చెప్పారు. తప్పనిసరై బయటకు వచ్చినప్పుడు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరనే విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story