ఇద్దరు అన్నదమ్ములు కరోనాతో.. తమ్ముడు గుండెపోటుతో..

ఇద్దరు అన్నదమ్ములు కరోనాతో.. తమ్ముడు గుండెపోటుతో..
X

ముగ్గురన్నదమ్ముల్లో ఇద్దరికి కరోనా వచ్చి మరణించగా ఒకరు గుండెపోటుతో మరణించారు. ఈ విషాద సంఘటన గుజరాత్ దిశ పట్టణంలో చోటు చేసుకుంది. దిశ పట్టణానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దశరథ్ చోకావాలా(76), జయచంద్ చోకావాలా(74), వినోద్ చోకావాల(60)లు దగ్గరి బంధువు అంత్యక్రియలకు జూన్ 1న వెళ్లారు. అక్కడ ఇద్దరు అన్నదమ్ములకు కరోనా వైరస్ అంటుకుంది. జూన్ 9న ఒకరు, 11న మరొకరు కరోనాతో చనిపోయారు. 12న గుండెపోటుతో మరొకరు మరణించారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story