అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతే.. : ట్రంప్

అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతే.. : ట్రంప్

రానున్న ఎన్నికల్లో తాను ఓడిపోతే.. అది దేశానికే మంచి కాదని అమెరికా అధ్యక్షడు ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా నాడి తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని తెలిపింది. దీనికి కారణాలుగా కరోనా వైరస్ వలన పెరిగిన నిరుద్యోగ రేటు, కుదేలైన ఆర్థిక వ్యవస్థలను చూపించింది. ట్రంప్ కు 35శాతం ఓట్లు మాత్రమే పడతాయని చెప్పింది. అయితే, దీనిపై స్పందించిన ట్రంప్ నిజంగా నేను ఓడిపోతే.. వేరేపనులు చేసుకుంటానిని అన్నారు. అయితే, నల్లజాతియుడు హత్యతో ట్రంప్ సర్కార్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ అబ్రహం లింక్ తరువాత.. నల్లజాతియులకు ఎక్కువ మేలు చేసింది తానేనని చెప్పుకొచ్చారు. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసింది. ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ తరుపున ఓ బిడెన్ పోటీ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story