ఏపీలో మరో 246 మందికి కరోనా

ఏపీలో మరో 246 మందికి కరోనా
X

ఏపీలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 15,173 శాంపిల్స్ ను పరీక్షించగా 246 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5087కు చేరింది. అలాగే ఆదివారం 47 మంది కోలుకోవడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. దాంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2770 కు చేరింది. కొత్తగా మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 86కు చేరింది. ప్రస్తుతం 2231 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story