కర్నూలు జిల్లా నిశ్చితార్థ వేడుకలో కరోనా కలకలం

కర్నూలు జిల్లా నిశ్చితార్థ వేడుకలో కరోనా కలకలం
X

కర్నూలు జిల్లాలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో కరోనా కలకలం రేగింది. చాగలమర్రికి చెందిన యువతికి కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన యువకుడితో రెండ్రోజుల కిందట నిశ్చితార్థం అయ్యింది. అబ్బాయి తరపువాళ్లంతా విజయవాడ నుంచి కడపకు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి కారులో చాగలమర్రి చేరుకున్నారు. నిశ్చితార్థం సందడిగా సంతోషంగానే జరిగినా.. తీరా ఇప్పుడు ఆ ఫంక్షన్‌లో పాల్గొన్న వారిలో కొందరి రిపోర్ట్‌లు పాజిటివ్ రావడంతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అబ్బాయితోపాటు అతని తల్లిదండ్రులకు పరీక్షల్లో కరోనా నిర్థారణ కావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న అందరూ హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

Tags

Next Story