ఆయనతో ఎవరు మాట్లాడించారో నాకు తెలుసు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి తనవంక చూడకుండా పక్క చూపు చూస్తున్నారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. జగన్ చూపు ఆయన మీద ఉన్నందుకే 20 రోజులలో నరసాపురం ఎంపీగా గెలవడమేగాక పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ అయ్యారన్నారు. పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారన్నారు. ఇటీవలే గోకరాజు రంగరాజు లాంటివారిని పార్టీలో చేర్చుకున్నారని, దానికి ఎంపీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ప్రసాద రాజు అన్నారు. వైసీపీలో కోటరీలు లేవు... సీఎం జగన్‌కు అందరూ సమానమే అన్నారు...
మరోవైపు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కామెంట్స్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ ఇంటర్వ్యూతో నా మిత్రులు ప్రసాదరాజుకు త్వరలో మంత్రి పదవి తప్పకుండా వస్తుందని అన్నారు. ఇది ఆయనతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసన్నారు. నేను సీట్ అడిగానో... నన్ను బతిమాలితే వచ్చానో ఆయనకి తెలుసని చెప్పారు. తనకు పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ ఎవరు ఇచ్చారో కూడా ప్రసాదరాజుకు తెలుసని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను డైలీ ఎంత మందితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నానో... ఇసుక కరప్షన్స్, హౌస్ సైట్స్ అవినీతిపై కంప్లైంట్స్ తీసుకుని ఎలా సాల్వ్ చేస్తున్నానో అందరికీ తెలుసని అన్నారు. అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం తన పాలసీ కాదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. అందుకే అటువంటి సొమ్ముతో ఫొటోస్ దిగడానికి వెళ్లలేదని చెప్పారు. సెపరేట్‌గా అడిగితే టైం ఇవ్వలేదు.... ఏదేమైనా ప్రసాదరాజు మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రఘురామకృష్ణంరాజు అన్నారు. వచ్చే మంత్రి వర్గవిస్తరణలో ప్రసాదరాజు మంత్రి పదవిని రిజర్వ్ చేసుకోడానికి ఇలాంటి కామెంట్లు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com