ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్‌ను సీజ్‌ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్లాంట్‌ను సీజ్‌ చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సీజ్‌ చేయడం రాజ్యాంగ విరుద్దమని భావించట్లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Tags

Next Story