తెలంగాణలో కరోనా వైరస్ వీర విహారం

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అడ్డూ అదుపు లేకుండా వైరస్ వీర విహారం చేస్తోంది. ప్రతి రోజూ సుమారు 200 కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా మరో 237 కేసులు నమోదయ్యాయి. ఒక్క GHMC పరిధిలోనే 195 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4 వేల 974కు చేరింది. కొత్తగా మరో ముగ్గురు చనిపోవడంతో మృతుల సంఖ్య 185కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 వేల 377 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2 వేల 412 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణలో 1094 కేసులు.. 29 మరణాలు నమోదైతే.. 37 రోజుల్లో మరో 3880 కేసులు.. 156 మరణాలు నమోదయ్యాయి.. తెలంగాణ వ్యాప్తంగా రెండు వారాల్లో ఏకంగా 2290 కరోనా కేసులు.. 103 మరణాలు న మోదు కావడం ఆందోళన పెంచుతోంది. వైరస్ భారిన పడుతున్నవారిలో ఫ్రంట్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు భారీగా ఉండడం పరిస్థితి అద్దం పడుతోంది.
జిల్లాల్లోనూ క్రమంగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో మేడ్చల్ జిల్లాలో 10 మంది కరోనా సోకింది.. రంగారెడ్డిలో 8, సంగారెడ్డిలో ఐదుగురు, మంచిర్యాలలో ముగ్గురు, వరంగల్ అర్బన్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పిన వైరస్ బారిన పడ్డారు. మెదక్, సిరిసిల్లా, ఆదిలాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్ రూరల్‌లో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com