జనావాసాలకు సమీపంగా పులుల సంచారం.. ప్రజల ఆందోళన

జనావాసాలకు సమీపంగా పులుల సంచారం.. ప్రజల ఆందోళన
X

మంచిర్యాల, కర్నూలు జిల్లాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. అవి జనావాసాలకు సమీపంగా వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ సమీపంలోకి చిరుత వచ్చింది. ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో సింగరేణి అధికారులు అలర్టయ్యారు. పులి సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు వణికిపోతున్నారు.

అటు.. కర్నూలు జిల్లా అహోబిలంలోనూ చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈనెల 8న తెలుగు గంగ కాలువ వద్ద కనిపించిన చిరుత.. మరోసారి ప్రత్యక్షమైందని స్థానికులు తెలిపారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Tags

Next Story