యూఎస్ లో తగ్గిన కరోనా మరణాలు.. 24 గంటల్లో 342 మంది..

X
గడిచిన 24 గంటల్లో యునైటెడ్ స్టేట్స్ లో 382 కరోనా వైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణించిన వారి సంఖ్య 115,729 కు చేరుకుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఆదివారం తెలిపింది. ఏప్రిల్ లో ఇక్కడ కరోనా మరణాలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుండి ఇది అత్యల్ప 24 గంటల టోల్ అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. గత నెలరోజులుగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం. తాజాగా 300 మాత్రమే నమోదు కావడం ఆ దేశ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మున్ముందు వైరస్ ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
