బాలీవుడ్ నటుడు రట్టన్ చోప్రా కన్నుమూత

బాలీవుడ్ నటుడు రట్టన్ చోప్రా కన్నుమూత

బాలీవుడ్ నటుడు (అబ్దుల్ జబ్బర్ ఖాన్) రట్టన్ చోప్రా మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని మలేర్కోట్లా పట్టణంలో తుదిశ్వాస విడిచారు. దత్తపుత్రిక అనిత రట్టన్ చోప్రా మరణాన్ని ధృవీకరించారు. దివంగత నటుడు అయిన తన తండ్రి కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, చికిత్స చేసుకోవడానికి అవసరమైన డబ్బు లేదని అందువల్ల మరణించారని ఆమె పేర్కొన్నారు.

10 రోజుల క్రితం అయన బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, అక్షయ్ కుమార్ , సోను సూద్ ల నుండి ఆర్థిక సహాయం కోరినప్పటికీ, ఎటువంటి సమాధానం రాలేదని రట్టన్ చోప్రా కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరిలో రట్టన్ చోప్రాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

రట్టన్ చోప్రా చివరి రోజుల్లో తీవ్రమైన పేదరికంలో జీవనం సాగించారు. స్థానిక గురుద్వార, దేవాలయాలలో దానం చేసిన ఆహారం మీద బతికేవాడు. గత కొన్నేళ్లుగా హర్యానాలోని పంచకులాలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. 1972 లో విడుదలైన తనూజా-స్టారర్ మోమ్ కి గుడియా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే తన నానమ్మకు నటనంటే ఇష్టం లేదు. అందువల్ల ఆ సినిమాతోనే నటనకు స్వస్తి పలికారు. కాగా రట్టన్ చోప్రా అవివాహితుడుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story