కారు డ్రైవ్ చేస్తూ కాల్ రిసీవ్ చేసుకుంది.. అంతలోనే..

X
By - TV5 Telugu |15 Jun 2020 8:17 PM IST
యూఏఈలో ఓ మహిళ కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. దుబాయ్ అల్ మంజార్ బీచ్ దగ్గర ఓ మహిళ కారు పార్కు చేద్దామనుకుంది. అంతలో ఫోన్ రావడంతో యాక్సిలేటర్ మీద ఉంచిన కారు కంగారులో గట్టిగా నొక్కేసింది. అది రయ్ మని దూసుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు రెస్క్యూటీమ్ కు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమెను, ఆమె కారును సురక్షితంగా బయటకు లాగారు. ఫోన్ వచ్చిన కంగారులోనే ఇలా చేసినట్లు అధికారులు గుర్తించారు. వాహనం సముద్రం లోపల 30 మీటర్ల వరకు వెళ్లినట్లు రెస్క్యూ టీం తెలిపింది. ప్రయాణీకులు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని, ఆ సమయంలో ఫోన్ వాడకపోవడమే మంచిదని అధికారులు తెలియజేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com