భర్తపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపేసిన మహిళ

భర్తపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపేసిన మహిళ
X

సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భర్తపై కోపంతో ఓ మహిళ ఇద్దరు పిల్లల్ని చంపేసింది. కొన్నాళ్లుగా వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా తీవ్ర స్థాయిలో భార్యాభర్తలు గొడవపడ్డారు. పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆ మహిళ.. వాళ్లను చెరువులోకి తోసి చంపేసింది. తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా.. ఆఖరులో ఆ ప్రయత్నం విరమించుకుంది.

సూర్యాపేటలోని విద్యానగర్‌కు చెందిన నాగమణికి 2006లో వివాహం అయ్యింది. కొన్నాళ్లకే కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. నిన్న రాత్రి భర్తతో వాదన తర్వాత.. కొడుకు హర్షవర్థన్, కూతురు జ్యోతిమాధవితో చెరువుకట్టపైకి వచ్చింది. ఇద్దరినీ నీళ్లలోకి తోసేసింది. ఉదయాన్నే చెరువులో బాలుడు మృతదేహం తేలుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటికి అక్కడే ఉన్న నాగమణిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. పోలీసులు వచ్చేలోపు ఆమె అక్కడి నుంచి పరారైంది. బాలిక మృతదేహం కోసం ప్రస్తుతం చెరువులో గాలిపు చర్యలు జరుగుతున్నాయి.

Tags

Next Story