తన కేసు సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించిన అనితారాణి

తన కేసు సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించిన అనితారాణి
X

చిత్తూరు డాక్టర్ అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. తాను లేవనెత్తిన అంశాలపై విచారణ జరపాలని కోరడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అనితారాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనితారాణి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

వైసీపీ నేతలు తనను నిర్బంధించి వేధించారని పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనితారాణి ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసి రెండు నెలలైనా పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు.

Tags

Next Story