ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలను ఈసారి రెండు రోజులే జరిగే అవకాశం వుంది. ఆన్ లైన్ ద్వారా ఉభయసభలను ఉద్ద్యేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆ వెంటనే, గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే తీర్మానం ఆమోదించిన తర్వాత ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2 లక్షల 30 వేల కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్‌లో నవరత్నాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అటు, వ్యవసాయ బడ్జెట్ ను కూడా వెంటనే ప్రతిపాదించే ఛాన్స్ వుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ జరుగనుంది. ఇక రేపు బడ్జెట్‌పై చర్చతో పాటు.. ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం వున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం లోపు ఈ అసెంబ్లీ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, టీడీపీ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో టీడీపీ హాజరైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

