సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. బాలీవుడ్ ఇండస్ట్రీ హత్య చేసిందని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ఇండస్ట్రీ చిన్న చూపు చూస్తుందని ఆమె తెలిపింది. మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తున్న వారికి సపోర్ట్ చేయాల్సిన ఇండస్ట్రీ వెనక్కు లాగుతోందని మండిపడింది. అవకాశాలు లేక సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది ఇండస్ట్రీ చేసిన హత్య అని కంగనా ధ్వజమెత్తింది. కాగా, సుశాంత్ సింగ్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
