లక్షణాలు ఉంటేనే పరీక్ష.. ఫీజు రూ.2200

లక్షణాలు ఉంటేనే పరీక్ష.. ఫీజు రూ.2200

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనా వ్యాప్త తగ్గిందని కేసులు ఎక్కువగా రావట్లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం తీసున్న నిర్ణయాలు బాగున్నాయని ఐసీఎంఆర్ కూడా కితాబిచ్చిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, ఫీజుల వసూలు తదితర విషయాల గురిచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టుకు రూ.2200 ఫీజు

నిర్ణయించామన్నారు.

వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స అందిస్తే రూ.7500, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తే రోజుకు రూ.9వేలు ఫీజు నిర్ణయించామని అన్నారు. లక్షణాలు ఉంటేనే పరీక్ష నిర్వహిస్తారని, లేని వారికి చేయరని చెప్పారు. కరోనా వైరస్ తో ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 10 వేల మంది మరణించారని అన్నారు. సీఎం సూచించిన గైడ్ లైన్స్ మేరకు రాష్ట్రంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయగలిగామని అన్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story