సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆమె కన్నుమూత

సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ఆమె కన్నుమూత
X

ఇటీవల బాలీవుడ్‌‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక అతని వదిన బీహార్‌లోని పూర్ణియాలో సోమవారం కన్నుముశారు. సుశాంత్‌ మరణంచిన విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె.. అప్పటి నుంచి ఆహారం మానేశారు దాంతో ఆమె బీహార్‌లో తుది శ్వాస విడిచారు.

కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఉదయం తన బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 34 ఏళ్ల సుశాంత్ సింగ్ కొంతకాలంగా డిప్రెషన్‌ లో ఉన్నట్లు ముంబై పోలీసులు కనుగొన్నారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను సోమవారం కుటుంబ సభ్యులు, సినీ, టీవీ పరిశ్రమకు చెందిన సన్నిహితుల సమక్షంలో అంత్యక్రియలు చేశారు.

Tags

Next Story