మనమంతా మనుషులం.. కాస్త బాధల్ని పంచుకుందాం: అనుష్క

టాలీవుడ్ బ్యూటీ అనుష్క అందానికి ప్రతీక.. సుశాంత్ రాజ్ పుత్ మరణం తనను కలచి వేసిందని భావోద్వేగపు పోస్ట్ చేశారు. కష్టం వచ్చినప్పుడు తనివి తీరా ఏడ్వండి. మీ కన్నీళ్ల వెనుక కథను నలుగురితో పంచుకోండి. కొంచెమైనా భారం తగ్గుతుంది. కానీ ఆ భారాన్ని ఎక్కువ కాలం మోయకండి. ప్రతి ఒక్కరూ ఒక్కో మానసిక పరిస్థితిలో ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణంగా లేరు. జీవితం రోడ్ మ్యాప్ కాదు.. ఇటు వెళ్తే సరైన దారి వస్తుంది.. ఇది దగ్గర దారి అని చెప్పడానికి ఎవరూ ఉండరు. మనకి మనమే నిర్దేశించుకోవాలి.
స్వంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి మిమ్మిల్ని మీరు ఫ్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టాలు, సుఖాలు, బాధలు ఉంటాయి. బాధ వచ్చినప్పుడు మౌనంగా రోదిస్తుంటారు. పరధ్యానంలో ఉంటారు. కొందరు నిస్సహాయంగా ఉంటారు. మరి కొందరు తమదైన మార్గాలను ఎంచుకుంటారు. ఓ ఆత్మీయ స్పర్శ.. ఓ చిరునవ్వు, ఓ ప్రేమ పూర్వక పలకరింపు బాధలో ఉన్నవారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ఎదుటి వారికి మనం చేయగలిగిన సహాయం ఏదైనా ఉందంటే అది ఇదే.. మార్పు మనతోనే ఆరంభిద్దాం. ప్రేమగా ఉండడం నేర్చుకుందాం అని అనుష్క అభిమానులతో పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com