రైతు సమస్యలపై కేసీఆర్ సమీక్షా సమావేశం

రైతు సమస్యలపై కేసీఆర్ సమీక్షా సమావేశం
X

తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కళ్లాల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, వ్యవసాయరంగం, సాగునీటి పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారులతో పాటు.. జిల్లా అటవీ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు హజరవుతున్నారు.

Tags

Next Story