వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులపై టీడీపీ నోటీసు

X
By - TV5 Telugu |17 Jun 2020 7:25 PM IST
ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఇవాళ్టి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపిన వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లుపై టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసు ఇచ్చారు. వీటిపై సభలో చర్చించకూడదని కోరుతూ రూల్ 90 కింద ఈ నోటీసు ఇచ్చారు. ఈ బిల్లులు గతంలోనే సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని తెలుగుదేశం MLCలు నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినా.. సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించలేదనేది TDP వాదన. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం శాసన మండలి ఛైర్మన్‌కు ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకే పంపాలని కోరారు. టీడీపీ ఇచ్చిన నోటీస్ నేపథ్యంలో మండలిలో ఏం జరుగుతుందని అనేదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com