శుభవార్త : కరోనాను కట్టడి చేసేందుకు ఇన్నాళ్లకు ఓ మార్గం దొరికింది..

శుభవార్త : కరోనాను కట్టడి చేసేందుకు ఇన్నాళ్లకు ఓ మార్గం దొరికింది..

ప్రపంచదేశాలను హడలెత్తిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇన్నాళ్లకు ఓ మార్గం దొరికింది. ఇన్నాళ్లుగా రోగ నిరోధక శక్తి పెంచుతూ వైరస్ ను జయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, కరోనా తీవ్ర దశలో ఉన్నప్పుడు మాత్రం ఆ రోగిని కాపాడటం దాదాపుగా అసాధ్యంగానే ఉండేది. కానీ, ప్రస్తుతం ఓ ఔషధం కరోనాను అరికట్టేందుకు అద్భుతమైన మాత్రగా పనిచేస్తోంది. దాని పేరే డెక్సమెథసోన్. ఈ స్టెరాయిడ్ ద్వారా మృత్యువుకు దగ్గరైన వారు కూడా కోలుకుంటున్నట్లు యూకే పరిశోధకులు చెబుతున్నారు. డెక్సమెథసోన్ వాడటం ద్వారా ఒక్క యూకేలోనే దాదాపు 5 వేల మందిని కాపాడగలిగామని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 4 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అసలు మందే లేదే కరోనా వ్యాధిని ఎలా అరికట్టాలో తెలియక ప్రపంచమంతా గందరగోళంలో పడిపోయింది. ఈ సమయంలో యూకే సైంటిస్టుల ప్రకటన ఊరట కలిగిస్తోంది. డెక్సమెథసోన్ ను అతి తక్కువ మోతాదులో వాడటం ద్వారా చివరి దశలో ఉన్న పేషెంట్లు కూడా కోలుకుంటున్నారని, జనరిక్ స్టెరయిడ్ డ్రగ్ అద్భుతంగా పని చేస్తోందని చెబుతున్నారు. పైగా ఇది అతి తక్కువ ధరకే లభించటం కూడా కరోనా బాధితులకు మరో కలిసొచ్చే అంశం.

అయితే..డెక్సమెథసోన్ కరోనా బారిన పడిన అందిరిపై ఒకేలా ప్రభావం చూపించదని కూడా యూకే సైంటిస్టులు వివరించారు. అతి తక్కువ, మధ్య స్థాయి కరోనా లక్షణాలు ఉన్న వారికి డెక్సమెథసోన్ పని చేయదని కూడా వెల్లడించారు. అయితే..మృత్యువుతో పోరాడేవారికి మాత్రం మితంగా స్టెరయిడ్ డ్రగ్ ను ఇస్తే ఓ దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 28 శాతం తగ్గుతోందని కూడా యూకే సైంటిస్టులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story