చైనాలో మళ్లీ వైరస్ పడగ.. బీజింగ్ లో కేసులు చూస్తే..

చైనాలో మళ్లీ వైరస్ పడగ.. బీజింగ్ లో కేసులు చూస్తే..

కరోనా పుట్టిన చైనాలో మళ్లీ వైరస్ పడగ విప్పుతోంది. వుహాన్ లో కరోనా కట్టడి తర్వాత..డ్రాగన్ కంట్రీ వైరస్ నుంచి బయట పడినట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా చైనా రాజధాని బీజింగ్ ను కరోనా మహమ్మారి చుట్టుముట్టింది. చైనా కేపిటల్ లో రోజు రోజుకీ కరోనా తీవ్రత ఉద్ధృతం అవుతోంది. కొత్త మరో 31 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బీజింగ్ నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. దాదాపుగా అప్రకటిత లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఇందుకోసం 1200 విమాన సర్వీసులను రద్దు చేసింది చైనా. అలాగే బీజింగ్ లోని స్కూళ్లన్నింటిని మూసివేయించింది. బీజింగ్ నగరం విడిచి ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను ఆదేశించారు.

వుహాన్ లోని మాసం మార్కెట్ నుంచి వైరస్ ప్రబలిందని చెబుతున్న చైనాకు బీజింగ్ విషయంలో మార్కెట్ టెన్షన్ పట్టుకుంది. కేపిటల్ సిటీలోని అతిపెద్ద మార్కెట్ జిన్ ఫాడీ లో వైరస్ ప్రబలినట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిన్ ఫాడి మార్కెట్ ను మూసివేయించారు. మార్కెట్ ను సందర్శించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మే 30 నుంచి దాదాపు 2 లక్షల మందికిపైగా మార్కెట్ ను సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 8 వేల వర్కర్లకు పరీక్షలు చేయించి క్వారంటైన్ తరలించారు. జిన్ ఫాడీ మార్కెట్ లో కేసులు బయటపడుతుండటంతో... నగరంలోని 11 మార్కెట్లను మూసివేయించారు.

బీజింగ్ లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఐదు రోజుల్లోనే బీజింగ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య వందకి పెరిగింది. కొత్తగా మరో 31 మందికి కూడా పాజిటివ్ రావటంతో బీజింగ్ లోని దాదాపు 30 ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని అధిక శాతం స్కూళ్లు ప్రారంభం అవటంతో..ఇక క్లాసెస్ నిర్వహించొద్దని బీజింగ్ సిటీ అధికారులు ప్రకటించారు. విద్యార్ధులకు ఆన్ లైన్ లోనే పాఠాలు బోధించాలని కూడా సూచించారు.

మరోవైపు న్యూజిలాండ్ లోనూ పరిస్థితి మొదటికొచ్చేలా ఉంది. కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించుకున్నన్యూజిలాండ్ రెండు మూడ్రోజుల్లోనే కరోనా దాడి మళ్లీ ప్రారంభం అయ్యింది. కొత్త మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే..ఈ ఇద్దరు బాధితులు యూకే నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. దీంతో వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోటల్స్ లో డైనింగ్ పై ఆంక్షలు విధించారు. కేవలం పార్శిల్స్ కు మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే జన సమర్ధప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story