అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి ఆరోగ్యం గురించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాకబు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి.. రెండోసారి శస్త్ర చికిత్స నిర్వహించడం గురించి అడిగి తెలుసుకున్నారు. రక్తస్రావం ఆగకపోవడం వల్లే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్లు వివరించారు. అచ్చెన్నాయుడుకు అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లను చంద్రబాబు కోరారు. ఆపరేషన్ అయిందని చెప్పినా వినకుండా 21 గంటల పాటు కూర్చోబెట్టడం వల్లే అచ్చెన్నాయుడుకు గాయం తిరగబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు సైతం ఫోన్ చేసిన చంద్రబాబు.. భార్య మాధవితో మాట్లాడారు. అచ్చెన్న ఆరోగ్యంపై భయంగా ఉందని ఆమె చెప్పగా.. ఎలాంటి ఆందోళన వద్దని చంద్రబాబు ధైర్యం చెప్పారు. టీడీపీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com