డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
X

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ డీజీపీ గౌతం సవాంగ్‌కి TDP అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతల ప్రతీకార చర్యలకు పోలీసుల సహకారం తగదని, వారు పోలీసుల్ని పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత DGPపై ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే నియంత రాజకీయాలకు చికిత్సని అంబేద్కర్ చెప్పిన విషయాల్ని గుర్తు చేస్తూ.. పోలీసులు సమర్థంగా పనిచేయాలని కోరారు.

బలహీన వర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడుపై నమోదు చేసిన కేసులు కుట్రలో భాగమేనన్నారు. ఆయన ప్రజాసేవలో నాలుగు దశాబ్దాలుగా ఉన్నారని, ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేని నాయకుడిపై తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. అటు, అచ్చెన్నాయుడును కూడా చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు.

Tags

Next Story