చీర కొంటే కరోనా కిట్ ఫ్రీ..

చీర కొంటే కరోనా కిట్ ఫ్రీ..
X

వ్యాపారం పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి. వన్ ప్లస్ వన్ ఆఫర్లు పొయ్యాయి. ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చింది చీర కొంటే కరోనా కిట్ ఫ్రీ. ఏం చేస్తాం మూడు చీరలు.. ఆరు జాకెట్ ముక్కలులా ఉండే వ్యాపారం కాస్తా కరోనా మహమ్మారి కాలదన్నుకుపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. విభిన్నంగా ఆలోచించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది వ్యాపారులు కరోనాకు వాడే హోమియోపతి మందులు, ఆయుర్వేద మందులు, మాస్కులు అందిస్తున్నారు. రూ.500 ల చీరనుంచి 5 వేల రూపాయల చీరల వరకు కరోనా కవచం బాక్సులను ఉచితంగా అందిస్తున్నారు.

Tags

Next Story