ఐక్యరాజ్యసమితి ఎన్నికల్లో భారత్ విజయం..

ఎనిమిదోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా అవతరించింది. 193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో భారత్ 184 ఓట్లు సాధించింది. దాంతో రెండేళ్ల కాలానికి ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఎన్నికయినట్టు ప్రకటించారు. 2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్ కొనసాగనుంది. భారత్‌తో పాటు, ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించాయి.
55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ప్రతిష్టాత్మక భద్రతా మండలిలో నిలిచింది. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో ఎనిమిదిసార్లు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. కాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం బుధవారం జనరల్ అసెంబ్లీ 75 వ సెషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగింది. భద్రతా మండలిలో 5 మంది శాశ్వత సభ్యులు, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సభ్యులకు కోవిడ్ -19 ప్రత్యేక ఏర్పాట్ల కింద ఎన్నికలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com