కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో 12కి చేరిన మృతుల సంఖ్య

కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో 12కి చేరిన మృతుల సంఖ్య
X

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మరికొందరు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర మండలం పెద్దగోపవరంకు చెందిన వారు. ఈ గ్రామం నుంచి దైవదర్శనం కోసం వేదాద్రికి 25 మంది ట్రాక్టర్లో బయల్దేరారు. తిరిగి వస్తుండగా.. వీరి ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఆ వేగానికి ట్రాక్టర్ రోడ్డు కిందకు పడిపోయింది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అటు ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం.

Tags

Next Story