ఆ విషయంలో చర్యలు తీసుకోండి.. ఏపీ గవర్నర్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో గవర్నర్ పాత్రే కీలకమని, తక్షణం జోక్యం చేసుకుని అన్ని విషయాలు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. SECని రాష్ట్ర ప్రభుత్వం కించపరచడం అంటే రాజ్యాంగ సంస్థకు అగౌరవ పరచడం కిందకే వస్తుందని.. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో YCP అక్రమాలకు తెగపడిందని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ విషయాలను ఎప్పటికప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామని కూడా లేఖలో పేర్కొన్నార.
ఎన్నికల సమయంలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు సహా మరికొందరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా పోస్టింగుల్లో ఉంచిందని కన్నా గుర్తు చేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఎన్నికలు వాయిదా వేస్తే.. SECకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్‌ను పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని కన్నా అన్నారు. ఐతై.. ఆయన పని చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఇప్పటికైనా జోక్యం చేసుకుని పరిస్థితులు సరిదిద్దాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com