2020లో యుగాంతం.. అందులో నిజం ఎంత!!

2020లో యుగాంతం.. అందులో నిజం ఎంత!!

ఈ ఏడాదే యుగాంతం.. ఈ నెల జూన్ 21తో భూమి అంతరించిపోతుంది. అందరి జీవితాలు ముగిసి పోతాయి. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2020 వచ్చి ఇంకా 6 నెలలు కూడా గడవ లేదు. ఎన్నో విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అణుబాంబుని తలపిస్తుంది. కానీ 2012 డిసెంబర్ 21న భూమి అంతమవుతుందని అప్పట్లో మయాన్ క్యాలెండర్ తేల్చి చెప్పింది.

అది వెళ్లి పోయి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం 2020లో ఉన్నాం. అయితే మయాన్ క్యాలెండర్ తప్పని మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నామని శాస్త్రవేత్త, పండితుడు కూడా అయిన పాలో తగలోగుయిన్ ఒక ట్వీట్ చేశారు.

దీనిని బట్టి చూస్తే జూలియన్ క్యాలెండర్ ప్రకారం 2012లోనే ఉన్నాం. ఆ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ లోకి మారిపోవడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గింది. 1752లో గ్రెగోరియన్ క్యాలెండర్ లోకి మారాం. అప్పటి నుంచి ఈ 2020 వరకు చూస్తే మొత్తం 268 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 11 రోజులు తగ్గించుకుంటూ పోతే.. 268x11= 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి. ఆ వచ్చిన 2948 రోజులను 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన చూసినా 2020లో నుంచి 8 సంవత్సరాలు తీసేస్తే 2012 లోనే ఉన్నట్లు లెక్క అని పాలో తగలోగుయిన్ తన వాదనను వినిపిస్తున్నారు.

మయాన్ క్యాలెండర్ లో 2012 వ సంవత్సరం.. గ్రెగోరియన్ క్యాలెండర్ లో 8 సంవత్సరాల తరువాత ఉంది. దీని ప్రకారం 2020 జూన్ 21న భూమి అంతం కానుందని గుయిన్ వాదిస్తున్నారు. ఈ వివరణలతో పెట్టిన పోస్ట్ ని ట్విట్టర్ వెంటనే తొలగించింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల పరంపర మొదలైంది. అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇవన్నీ ఆధారాలు లేని లెక్కలు అని తేలిగ్గా కొట్టి పారేసింది. చూడాలి మరో నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో అని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story