కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉతాధికారులు ఏర్పాట్లును పరిశీలించారు. ఉదయం 7.45 నిమిషాలకు అంతిమ యాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. అంత్యక్రియల్లో ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. సంతోష్ బాబును కడసారి చూసేందుకు వచ్చే వారు భౌతిక దూరం పాటించాలని, ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఇంటి పరిసరాలను ప్రతి అరగంటకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.
ముందుగా ఆర్మీ అధికారుల లాంఛనాలకు మేరకు కల్నల్ సంతోష్ బాబుకు సైనికులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. సూర్యాపేటకు సమీపంలోనే ఉన్న కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com