ట్విట్టర్ పిట్టకు మాటలొస్తే..

ట్విట్టర్ పిట్టకు మాటలొస్తే..
X

ఇప్పటి వరకు ట్వీట్లు రాసి పోస్ట్ చేయడమే చూశాం. ఇక ముందు మాట్లాడీ ట్వీట్ చేయొచ్చు. త్వరలో ట్విట్టర్ పిట్ట మాట్లాడబోతోందని సంస్థ వివరించింది. త్వరలో వాయిస్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ట్వీట్ తో మీ వాయిస్ రికార్డ్ చేయొచ్చు. ఇందుకు గాను హోమ్ పేజీపై ఓ కొత్త ఐకాన్ యాడ్ చేశారు. అది మన మాట్లాడే మాటల వేవ్ లెన్త్ ను గ్రహించి ట్వీట్ చేస్తుంది. అయితే ఇది టెస్టింగ్ దశలో ఉందని మరి కొద్ది రోజుల్లో ట్విట్టర్ వినియోగ దారులు ఉపయోగించొచ్చని తెలిపింది. కానీ అందిరికీ కాదు యాపిల్ ఐఓఎస్ ఫ్లాట్ ఫామ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొంత మందికి మాత్రమే ఈ అవకాశం. రానున్న రోజుల్లో మరింత మంది ఐఓఎస్ యూజర్లు వాడుకోవచ్చని ట్విట్టర్ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో వివరించింది. స్క్రీన్ పై ఉన్న వేవ్ లెన్త్ ఐకాన్ ద్వారా యూజర్లు వాయిస్ ట్వీట్ చేయవచ్చు అని పోస్టులో తెలిపింది.

Tags

Next Story