తెలంగాణలో రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తెలంగాణలో రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 352 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6027కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగామలో యాక్టివ్ కేసులు 2,531గా ఉన్నాయి. గత 24 గంటల్లో 230 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3301కు చేరింది. గురువారం ముగ్గురు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 195కి చేరింది..

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 302 కొత్త కరోనా కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 10, మంచిర్యాలలో 4, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 కేసుల చొప్పున, జనగామ, వరంగల్ అర్బన్‌లో 3 కేసులు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి..

తెలంగాణలో గురువారం ఏకంగా 352 కొత్త కరోనా కేసులను గుర్తించడం కలవరపరుస్తోంది. అంతేకాక, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మూడొందలకు పైగా కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది...

మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ - ఐపీఎం , వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story