పెళ్లికళ వచ్చేసిందే బాలా..

పెళ్లికళ వచ్చేసిందే బాలా..

నిహారిక పెళ్లికి శుభం కార్డు పడింది. వరుడు ఎవరో తెలిసి పోయింది.. నిన్నటికి నిన్న ఇన్ స్టాలో పోస్టు పెట్టి ఇతడే నాక్కాబోయే వరుడు అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. ఈ రోజు ఆ ముడి విప్పింది. గుంటూరుకు చెందిన చైతన్య హైదరాబాద్ లోని ఓ ఎమ్ ఎన్ సీ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. తండ్రి పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసింది. ఇక వచ్చే ఏడాది నిహారిక పెళ్లి జరుగుతుందని ప్రచారం. ఒక మనసు చిత్రంతో పరిచయమైన నిహారిక.. హ్యాపీ వెడ్డింగ్, సూర్య కాంతం వంటి చిత్రాల్లో నటించింది.. యాంకరింగ్ చేసి బుల్లి తెర ప్రేక్షకులనూ అలరించింది. వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న నిహారిక అంటే మొదట గుర్తొచ్చే వెబ్ సిరీస్ ముద్దపప్పూ అవకాయ్. ప్రస్తుతం అశోక్ సెల్వన్ హీరోగా నటించనున్న తమిళ చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story